వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.1,500 కోట్ల విలువైన గండిపేట భూకుంభకోణం కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. తమిళనాడులో అరెస్టయిన ఆయన్ని పోలీసులు శనివారం హైదరాబాద్ కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి రిమాండ్‌కు ఆదేశించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు.
నకిలీ ప్రభుత్వ పత్రాలను సృష్టించి ప్రభుత్వ భూమిని కబ్జా చేశారనే ఆరోపణలతో ఈ కేసు నమోదైంది. ఈ కుంభకోణంలో ఇప్పటికే ఆరుగురిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. అజ్ఞాతంలో ఉన్న బ్రహ్మనాయుడిని ఇటీవల కాంచీపురంలో పట్టుకున్నారు.
Comments
Loading comments...

