వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో పనిచేస్తూ మరణించే ఔట్‌సోర్సింగ్ సిబ్బంది అంత్యక్రియల ఖర్చులను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మృతుల కుటుంబసభ్యులకు గతంలో ఇచ్చే రూ.15 వేల సహాయాన్ని రూ.20 వేలకు పెంచింది.
ఈ మొత్తాన్ని ఆయా అర్బన్ లోకల్ బాడీల జనరల్ ఫండ్స్ నుంచే భరించాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో వేలాది మంది సిబ్బంది కుటుంబాలకు ఊరట కలగనుంది.
Comments
Loading comments...

