వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ మానసిక ఆసుపత్రి నుంచి తిరిగొస్తూ తప్పించుకున్న జీవిత ఖైదీ సాకే రాజ్‌కుమార్‌ను కడప పోలీసులు 24 గంటల్లోనే అదుపులోకి తీసుకున్నారు. పోక్సో కేసులో శిక్ష పడిన ఇతడు, గూడూరు రైల్వేస్టేషన్ వద్ద భద్రతా సిబ్బంది కళ్లుగప్పి పరారయ్యాడు.
ఖైదీ కోసం కడప ఎస్పీ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు ముమ్మరం చేశారు. ప్రొద్దుటూరు శివారులో సంచరిస్తుండగా శుక్రవారం అతడిని పట్టుకుని, తిరిగి కడప కేంద్ర కారాగారానికి తరలించారు.
Comments
Loading comments...
