వార్తలకు తిరిగి వెళ్లండి

తన గర్ల్‌ఫ్రెండ్‌పై తాను లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా, వందలాది మందితో ఆమెను రేప్ చేయించిన గుల్లెమ్ బుచ్చి (51) అనే వ్యక్తికి ఫ్రాన్స్ కోర్టు 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2015 నుంచి 2022 వరకు నిందితుడు బలవంతంగా ఈ ఘాతుకానికి ఒడిగట్టాడని బాధితురాలు కోర్టులో తెలిపింది.
దాదాపు 487 మంది పురుషులతో తనపై దాడులు చేయించి, ఆ పేర్లను బలవంతంగా నమోదు చేయించాడని పేర్కొంది. ఈ దారుణాలను వీడియోలు తీసి, ఎవరికైనా చెబితే బయటపెడతానని నిందితుడు బెదిరించాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.
Comments
Loading comments...

