వార్తలకు తిరిగి వెళ్లండి
విద్యార్థులకు ఉచిత రైటింగ్ బోర్డుల పంపిణీ

నిజామాబాద్ మండలం మల్లారం ప్రభుత్వ పాఠశాలలో కేజీఎఫ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచితంగా రైటింగ్ బోర్డులు పంపిణీ చేశారు. ప్రతి విద్యార్థి క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరై ఉన్నత లక్ష్యాలు సాధించాలని సూచించారు.
విద్య, ఆరోగ్యం, క్రీడల రంగాల్లో చిన్నారులకు అండగా ఉంటామని ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల అభివృద్ధికి అవసరమైన సహాయం నిరంతరం అందిస్తామని పేర్కొన్నారు.
Comments
Loading comments...