Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మత్స్యకారులకు ఉచిత చేప పిల్లల పంపిణీకి రూ.116 కోట్లు

Follow Udayam on Google
రచన దేవి Aug 04, 2026 1:31 PM పెద్దపల్లి General
మత్స్యకారులకు ఉచిత చేప పిల్లల పంపిణీకి రూ.116 కోట్లు - Udayam
ఉచిత చేప, రొయ్య పిల్లల పంపిణీ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.116 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మత్స్యకార సహకార సంఘాల పరిధిలో చేప పిల్లలను వదిలేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. జిల్లాలోని 3,441 చెరువులు, కుంటలు, జలాశయాల్లో చేప పిల్లల పంపిణీ చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో మత్స్యకారుల జీవనోపాధికి తోడ్పాటు అందనుంది.

Comments

G
Loading comments...