Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉచితంగా క్యాన్సర్ వైద్యం అందించాలి

మానస శర్మ Jul 22, 2026 2:03 PM హైదరాబాద్in about 4 hours
ఉచితంగా క్యాన్సర్ వైద్యం అందించాలి - Udayam Digital
25 శాతం ఉచిత కోటా కింద జగిత్యాల జిల్లాకు చెందిన బాలె భాగ్యమ్మకు తక్షణం చికిత్స అందించాలని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిని హైకోర్టు ఆదేశించింది. నిరాకరణపై జస్టిస్ ఎన్.వి.శ్రవణ్ కుమార్ ఈ ఉత్తర్వులు ఇచ్చారు. రోగికి అందుతున్న వైద్య సహాయాన్ని పర్యవేక్షించి నివేదిక సమర్పించాలని డీఎంహెచ్‌ఓను ఆదేశించింది. పేదలకు ఉచిత సేవలు అందించాలని స్పష్టం చేస్తూ విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది.

Comments

G
Loading comments...