Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హౌసింగ్‌ బోర్డులో రూ.41 లక్షల పనులకు శంకుస్థాపన

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Aug 08, 2026 6:01 PM నెల్లూరుGeneral
హౌసింగ్‌ బోర్డులో రూ.41 లక్షల పనులకు శంకుస్థాపన - Udayam
నెల్లూరు రూరల్‌ 24వ డివిజన్‌ హౌసింగ్‌ బోర్డు కాలనీలో రూ.41 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు, సీసీ డ్రైన్‌ పనులకు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక డివిజన్‌ అభివృద్ధికి రూ.10 కోట్లు, నెల్లూరు రూరల్‌లో రూ.857 కోట్లతో పనులు జరుగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వానికి ప్రజల ఆశీస్సులు ఉండాలని కోరారు.

Comments

G
Loading comments...