వార్తలకు తిరిగి వెళ్లండి

అబ్బాపూర్ శివారులో శుక్రవారం మధ్యాహ్నం మాజీ ఎంపీటీసీ గండి కుమార్ ద్విచక్రవాహనంపై వెళ్తుండగా కుక్క అడ్డురావడంతో వాహనం అదుపుతప్పి కిందపడ్డారు. గ్రామస్థులు వెంటనే స్పందించి ఆయనను ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించారు.
విషయం తెలుసుకున్న భద్రాచలం మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఆసుపత్రికి వెళ్లి గండి కుమార్‌ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
Comments
Loading comments...

