Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇళ్లపై జాతీయ జెండా ఎగురవేయాలి

Follow Udayam on Google
విఘ్నేష్ రెడ్డి Aug 13, 2026 2:18 PM నారాయణపేటGeneral
ఇళ్లపై జాతీయ జెండా ఎగురవేయాలి - Udayam
ప్రతి ఒక్కరు తమ ఇళ్లపై జాతీయ జెండా ఎగురవేసి దేశభక్తిని చాటుకోవాలని రాష్ట్ర బీజేపీ క్రమశిక్షణ సంఘం సభ్యుడు నాగురావు నామాజీ పిలుపునిచ్చారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా గురువారం ఆయన తన నివాసంలో జెండా ఆవిష్కరించారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నందు నామాజీతో పాటు పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...