Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరదల్లో కొట్టుకుపోయిన 3,000 ఎల్పీజీ సిలిండర్లు

Follow Udayam on Google
మానస శర్మ Jul 09, 2026 9:04 AM జాతీయంGeneral
వరదల్లో కొట్టుకుపోయిన 3,000 ఎల్పీజీ సిలిండర్లు - Udayam
మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు పాతాళ్‌గంగ ఎల్‌పీజీ బాట్లింగ్ ప్లాంట్ జలమయమైంది. వరద ఉధృతికి ప్లాంట్ ప్రహరీ గోడ కూలిపోవడంతో, అందులోని సుమారు 3,000 గ్యాస్ సిలిండర్లు పాతాళగంగా నదిలోకి కొట్టుకుపోయాయి. నది ఒడ్డుకు కొట్టుకొచ్చే సిలిండర్లను ప్రజలు ఎవరూ ముట్టుకోవద్దని, వాటిని ఇంటికి తీసుకెళ్లడం ప్రమాదకరమని జిల్లా కలెక్టర్ కిషన్ జవాలే హెచ్చరించారు. గల్లంతైన సిలిండర్లను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...