వార్తలకు తిరిగి వెళ్లండి

పల్నాడు జిల్లా రెంటాలకు చెందిన వైకాపా నేత నవులూరి చెన్నారెడ్డి హత్య కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. దాచేపల్లి-మాచర్ల క్రాస్‌రోడ్డులో వారిని అదుపులోకి తీసుకున్నారు.
నిందితుల నుంచి వాహనం, గొడ్డళ్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది. రాజకీయ ఆధిపత్య పోరులో భాగంగానే చెన్నారెడ్డిని ప్రత్యర్థులు హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
Comments
Loading comments...

