వార్తలకు తిరిగి వెళ్లండి
బాణసంచా ముప్పు: కాలి బూడిదైన మూడు గడ్డివాములు

ఉయ్యాలవాడ మండలం అల్లూరులో మొహర్రం వేడుకల్లో పేల్చిన బాణసంచా నిప్పురవ్వలతో మూడు గడ్డివాములు కాలి బూడిదయ్యాయి. ఈ ప్రమాదంలో 600 గడ్డి చుట్టలు దగ్ధమై సుమారు రూ. 3 లక్షల ఆస్తి నష్టం జరిగింది.
మంటలను ఆర్పే ప్రయత్నంలో రైతు రామకృష్ణారెడ్డికి, పశువుల పాకలోని పాడి పశువులకు గాయాలయ్యాయి. నష్టపోయిన తనను ప్రభుత్వం ఆదుకోవాలని సదరు రైతు వేడుకుంటున్నారు.
Comments
Loading comments...