Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బంగారు ఆభరణాలు దొంగిలించిన వ్యక్తి పట్టివేత

Follow Udayam on Google
భవ్య శ్రీ Jun 30, 2026 11:52 AM పశ్చిమగోదావరి General
బంగారు ఆభరణాలు దొంగిలించిన వ్యక్తి పట్టివేత - Udayam
నరసాపురం పట్టణంలో మద్యం మత్తులో ఉన్న వ్యక్తి వద్ద బంగారు ఆభరణాలను దొంగిలించిన పాలెపు దుర్గాప్రసాద్ (23) అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన నిందితుడి వద్ద నుంచి సుమారు రూ. 1.70 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ ఆకుల రఘు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టామని, తదుపరి చర్యలు తీసుకుంటున్నామని సీఐ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...