వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లోని నాంపల్లి క్రిమినల్ కోర్టు మూడో అంతస్తులో సోమవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది.
ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ప్రమాద తీవ్రత మరియు జరిగిన ఆస్తి నష్టంపై పూర్తిస్థాయి విచారణ చేపట్టారు.
Comments
Loading comments...

