Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంటాడలో దోమల నివారణకు ప్రత్యేక చర్యలు

Follow Udayam on Google
హరిక Aug 18, 2026 3:16 PM కృష్ణా జిల్లాGeneral
మంటాడలో దోమల నివారణకు ప్రత్యేక చర్యలు - Udayam
మంటాడ, రెడ్డిపాలెం, ఇందిరమ్మ కాలనీలలో దోమల నివారణ చర్యల్లో భాగంగా మంగళవారం ఎబిట్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. కపిలేశ్వరపురం PHC వైద్యాధికారి డా. బాలాజీ పాల్గొని, దోమల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు. వృథా నీటిని నిల్వ చేయొద్దని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. వైద్య ఆరోగ్య సిబ్బంది సూపర్వైజర్ వెంకటేశ్వరరావు, ఏఎన్ఎం లక్ష్మి పాల్గొన్నారు.

Comments

G
Loading comments...