Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

పబ్‌లో అగ్నిప్రమాదం: 27మృతి

Follow Udayam on Google
భవేష్ కుమార్ Jul 13, 2026 7:07 AM జాతీయంGeneral
పబ్‌లో అగ్నిప్రమాదం: 27మృతి - Udayam
థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లోని ఓ పబ్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘోర ప్రమాదంలో 27 మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాద స్థలాన్ని థాయ్‌లాండ్ ప్రధాని అనుతిన్ పరిశీలించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై అధికారులు కేసు నమోదు చేసి తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...