Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జులై 23న ప్రజల ముందుకు ఇరాన్ సుప్రీం లీడర్

Follow Udayam on Google
మనీష్ రెడ్డి Jul 12, 2026 7:23 PM జాతీయంGeneral
జులై 23న ప్రజల ముందుకు ఇరాన్ సుప్రీం లీడర్ - Udayam
ఇరాన్ సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అజ్ఞాతంలో ఉన్న మొజ్తబా ఖమేనీ త్వరలో ప్రజల ముందుకు రానున్నారు. జులై 23న టెహ్రాన్‌లో తన తండ్రి, మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ స్మారక సభను ఆయన నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 28 దాడుల్లో గాయపడిన ఆయన భద్రతా కారణాలతో తండ్రి, భార్య అంత్యక్రియలకు దూరంగా ఉన్నారు. ఆ దాడుల్లో ఆయన ఒక కుమార్తెను కూడా కోల్పోయారు. కాగా, తన తండ్రి మరణానికి కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటానని తాజాగా ఆయన సోషల్ మీడియాలో ప్రతిజ్ఞ చేశారు.

Comments

G
Loading comments...