Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ ఏర్పాట్లపై తలసాని సమీక్ష

కౌశిక్ శర్మ Jul 17, 2026 12:28 PM హైదరాబాద్about 2 hours ago
బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ ఏర్పాట్లపై తలసాని సమీక్ష - Udayam Digital
బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మాజీమంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 21న జరగబోయే అమ్మవారి కల్యాణం, 22న నిర్వహించే రథోత్సవ ఆహ్వాన పత్రికను ఆలయ ఈవో వినోద్ రెడ్డి శుక్రవారం తలసానికి అందజేశారు. లక్షలాదిగా వచ్చే భక్తులకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు.

Comments

G
Loading comments...