వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు ఆర్థిక స్వయం ప్రతిపత్తి కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీనికోసం పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 70(3)కి కీలక సవరణలు చేయనున్నారు. ఈ చారిత్రాత్మక ఫైలుకు నేడు క్యాబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
ఇకపై పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని ట్రెజరీతో సంబంధం లేకుండా గ్రామాల్లో అత్యవసర పనులకు నేరుగా వాడుకోవచ్చు. దీనివల్ల నిధుల కోసం ఆర్థిక శాఖ అనుమతి చుట్టూ తిరిగే ఇబ్బందులు తొలగిపోనున్నాయి.
Comments
Loading comments...

