Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎరువుల కొరత, ధరల పెరుగుదలతో రైతుల ఆందోళన

Follow Udayam on Google
Rohit Singh Jun 09, 2026 12:40 PM హైదరాబాద్General
ఎరువుల కొరత, ధరల పెరుగుదలతో రైతుల ఆందోళన - Udayam
మార్క్‌ఫెడ్‌ వద్ద యూరియా, డీఏపీ నిల్వలు భారీగా తగ్గడంతో వానకాలం సాగుకు ఎరువుల కొరత ముంచుకొస్తోంది. నాలుగు లక్షల టన్నుల యూరియా బఫర్‌స్టాక్‌కు గానూ కేవలం 2.2 లక్షల టన్నులే అందుబాటులో ఉండటం గమనార్హం. మరోవైపు డీఏపీ నిల్వలు కేవలం 10 వేల టన్నులే ఉన్నాయి. ఇదే సమయంలో కాంప్లెక్స్ ఎరువుల ధరలను కంపెనీలు భారీగా పెంచడంతో పెట్టుబడి భారం పెరిగి రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

Comments

G
Loading comments...