Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీట్ ఫలితాల్లో సౌందర్య సత్తా

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Jul 17, 2026 10:51 AM నిజామాబాద్General
నీట్ ఫలితాల్లో సౌందర్య సత్తా - Udayam
ధర్పల్లి మండలం నడిమి తండాకు చెందిన బనావత్ సౌందర్య నీట్ ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచింది. గురువారం విడుదలైన ఈ ఫలితాలలో ఆమె జాతీయ స్థాయిలో 2762వ ర్యాంకు సాధించి గ్రామానికి మంచి పేరు తెచ్చింది. సౌందర్య సాధించిన ఈ ఘనతపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఆమె తల్లిదండ్రులు ప్రకాష్ నాయక్, సరోజినీ బాయ్‌లను కలిసి గ్రామస్తులు ప్రత్యేకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు.

Comments

G
Loading comments...