వార్తలకు తిరిగి వెళ్లండి

ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం దండిపూడి అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తుండటంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. నిమ్మలగూడెం శివార్లలో పశువులపై దాడి చేసి రెండు ఆవులను చంపేయడంతో గ్రామస్తులు వణికిపోతున్నారు. రేడియో కాలర్ సిగ్నల్స్ ద్వారా పులి కదలికలను అధికారులు గుర్తించారు.
ప్రస్తుతం ఎన్‌ఎస్‌టీఆర్ (NSTR), ఆర్‌ఆర్‌టీ బృందాలు పులిని ట్రాక్ చేస్తున్నాయి. అటవీ అధికారులు మైకుల ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తూ, అడవి వైపు వెళ్లవద్దని, రాత్రి వేళ బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు.
Comments
Loading comments...

