వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షాలు కురవడంతో వ్యవసాయ పనులు వేగం పుంజుకున్నాయి. భూములు తడవడంతో నాట్లు ముమ్మరమయ్యాయి. భూపాలపల్లి జిల్లా లోటు వర్షపాతం నుంచి బయటపడగా, ఇతర జిల్లాల్లో లోటు కొనసాగుతోంది.
ఉమ్మడి జిల్లాలో 15.89 లక్షల ఎకరాలకు 8.73 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. పత్తి సాగు 98 శాతానికి చేరగా, వరి సాగు 26 శాతం నమోదైంది. మొక్కజొన్న 79 శాతం సాగైంది.
Comments
Loading comments...

