Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధాన్యం బకాయిలపై రైతుల ధర్నా

Follow Udayam on Google
రాజిత దేవి Aug 01, 2026 2:33 PM రాజన్న సిరిసిల్లGeneral
ధాన్యం బకాయిలపై రైతుల ధర్నా - Udayam
ధాన్యం బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ రైతులు శనివారం వేములవాడలో భాజపా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వడ్లను రోడ్డుపై పోసి నిరసన తెలపడంతో ప్రధాన రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఆందోళనకారులను నిలువరించే క్రమంలో పోలీసులు, భాజపా నేతల మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం భాజపా నాయకులు, కార్యకర్తలను పోలీసులు ఠాణాకు తరలించగా, అక్రమ అరెస్టులంటూ భాజపా నేతలు ఆరోపించారు.

Comments

G
Loading comments...