వార్తలకు తిరిగి వెళ్లండి

ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రెండు నెలలు గడిచినా నంద్యాల జిల్లాలో రైతులకు భూసార ఆరోగ్య కార్డులు అందలేదు. జిల్లా వ్యాప్తంగా 3,600 మట్టి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపినా ఫలితాలు ఇంకా చేరలేదు.
దీంతో రైతులు భూసార వివరాలు లేకుండానే పంటలు సాగు చేస్తున్నారు. శాస్త్రీయ సాగుకు ఆటంకం ఏర్పడటంతో పాటు భవిష్యత్తులో భూముల సారం దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

