Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులపై జులుం.. డీఎస్పీకి ప్రమోషన్

Follow Udayam Digital on Google
Rajdeep Sardesai Jun 17, 2026 7:38 AM అమరావతిఆంధ్రప్రదేశ్
రైతులపై జులుం.. డీఎస్పీకి ప్రమోషన్ - Udayam Digital
వైకాపా హయాంలో అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకుని, అరాచకాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న నాటి డీఎస్పీ బాలచంద్రారెడ్డికి కూటమి ప్రభుత్వం మంగళవారం కీలక పోస్టింగ్ ఇచ్చింది. తాజాగా ఆయనను పదోన్నతిపై తిరుపతి జిల్లా క్రైమ్స్ అదనపు ఎస్పీగా నియమించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గతంలో రామచంద్రపురంలో రైతులపై దాడి చేసి, రథం సీసీ కెమెరా హార్డ్ డిస్క్‌లను ధ్వంసం చేశారనే తీవ్ర విమర్శలు ఈయనపై ఉన్నాయి. ఇటువంటి వివాదాస్పద పోలీస్ అధికారికి ప్రభుత్వం ప్రాధాన్య పోస్టింగ్ ఇవ్వడంపై రాజకీయ వర్గాలలో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.

Comments

G
Loading comments...