Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాగునీటి కోసం ఎస్సై కాళ్లు పట్టుకున్న రైతు

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 17, 2026 12:47 PM ఖమ్మంGeneral
సాగునీటి కోసం ఎస్సై కాళ్లు పట్టుకున్న రైతు - Udayam
ఖమ్మం జిల్లా వైరా రిజర్వాయర్‌ నుంచి సాగునీరు విడుదల చేయాలని రైతులు ఇరిగేషన్‌ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. రిజర్వాయర్‌లో 17 అడుగుల నీరు ఉన్నప్పటికీ ప్రభుత్వం నీటిని విడుదల చేయడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనను అడ్డుకునేందుకు వచ్చిన ఎస్సై కాళ్లపై ఓ రైతు పడి, పంటలను కాపాడేందుకు నీటిని విడుదల చేయాలని వేడుకున్నారు. ఈ ఘటన అక్కడున్న వారిని కలచివేసింది.

Comments

G
Loading comments...