వార్తలకు తిరిగి వెళ్లండి

జనగామ మండలం వెంకిర్యాల గ్రామానికి చెందిన చింతకింది పుష్పలీల మృతి అనంతరం ఆమె పార్థివదేహాన్ని కుటుంబ సభ్యులు వైద్య విద్య అధ్యయనం కోసం శామీర్‌పేటలోని ఆర్వీఎం మెడికల్ కళాశాలకు అప్పగించారు.
కుమారుడు చింతకింది మురహరి కుటుంబ సభ్యుల సమ్మతితో ఈ నిర్ణయం తీసుకున్నారు. వైద్య విద్యార్థులకు ఉపయోగపడేలా చేసిన ఈ మానవతా నిర్ణయాన్ని స్థానికులు అభినందించారు.
Comments
Loading comments...

