Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నకిలీ డీఏపీ గుట్టు రట్టు.. ముఠా అరెస్ట్

Follow Udayam on Google
విష్ణు వర్ధన్ Jul 23, 2026 10:34 AM నాగర్ కర్నూల్General
నకిలీ డీఏపీ గుట్టు రట్టు.. ముఠా అరెస్ట్ - Udayam
జిల్లాలోని పలు గ్రామాల్లో నకిలీ డీఏపీ ఎరువులు విక్రయిస్తున్న ముఠాను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో నకిలీ ఎరువులు తయారు చేసి, ఇక్కడ తక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు వెల్లడించారు. సమాచారం అందుకున్న అధికారులు దాడులు నిర్వహించి భారీగా బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉండగా, మిగతా నిందితులను రిమాండ్‌కు తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...