Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భక్తులకు గదులు అధిక ధరలకు విక్రయిస్తున్న ముఠా అరెస్ట్‌

Follow Udayam on Google
మనీష్ Aug 17, 2026 4:57 PM తిరుపతిGeneral
భక్తులకు గదులు అధిక ధరలకు విక్రయిస్తున్న ముఠా అరెస్ట్‌ - Udayam
నకిలీ ఆధార్ కార్డులతో గదులు పొంది భక్తులకు అధిక ధరలకు విక్రయిస్తున్న దళారీ ముఠాను టీటీడీ విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. కేరళకు చెందిన ఆషిక్ అలీని అదుపులోకి తీసుకుని రెండు నకిలీ ఆధార్ కార్డులు, గది స్లిప్, నగదు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. తిరుమల-2 టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, ఇతర నిందితుల కోసం దర్యాప్తు చేస్తున్నారు. దళారులను నమ్మవద్దని టీటీడీ భక్తులకు సూచించింది.

Comments

G
Loading comments...