Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జనసేనలో వర్గపోరు

Follow Udayam on Google
రేఖ దేవి Jul 14, 2026 8:45 AM విశాఖపట్నంGeneral
జనసేనలో వర్గపోరు - Udayam
విశాఖ జనసేన పార్టీలో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. రూ.150 కోట్ల ప్రభుత్వ ఆస్తుల కబ్జాదారులకు మద్దతుగా దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ మంత్రి నారాయణకు సిఫార్సు లేఖ రాశారని జనసేన నేత పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. జీవీఎంసీ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మూర్తియాదవ్ ఈ విషయమై వినతిపత్రం ఇచ్చారు. సొంత పార్టీ ఎమ్మెల్యే తీరును ఆయన ఎండగట్టడం జిల్లాలో తీవ్ర దుమారం రేపుతోంది.

Comments

G
Loading comments...