వార్తలకు తిరిగి వెళ్లండి

మెటా సంస్థ రెడ్డిట్ తరహాలో 'ఫేస్‌బుక్ ఫోరమ్' అనే సరికొత్త స్టాండలోన్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. నచ్చిన అంశాలపై చర్చించుకునేందుకు, సమాచారాన్ని పంచుకునేందుకు ఇది వీలు కల్పిస్తుంది. ఫేస్‌బుక్ అకౌంట్ ద్వారానే దీనిలోకి లాగిన్ అవ్వొచ్చు. ఇందులో నిక్‌నేమ్‌తో పోస్టులు చేయడంతో పాటు ఏఐ అసిస్టెంట్ సదుపాయం కూడా ఉంది.
ప్రస్తుతం అమెరికాలోని కొంతమంది ఐఓఎస్ యూజర్లకు ఈ యాప్‌ను ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెచ్చారు. త్వరలోనే దశలవారీగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులందరికీ దీనిని విడుదల చేయనున్నారు.
Comments
Loading comments...

