వార్తలకు తిరిగి వెళ్లండి

పెట్రోల్‌లో ఇథనాల్ కలపడం ద్వారా భారత్ అదనంగా 3.1 కోట్ల మెట్రిక్ టన్నుల క్రూడాయిల్ దిగుమతి భారాన్ని తప్పించుకుంది. ఈ వ్యూహాత్మక చర్య దేశ ఇంధన రంగానికి తిరుగులేని రక్షణ కవచంగా నిలిచిందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పష్టం చేశారు.
దీనివల్ల రూ.1.90 లక్షల కోట్ల విదేశీ మారక ద్రవ్యం ఆదా అవ్వడమే కాకుండా, రైతులకు రూ.1.60 లక్షల కోట్ల అదనపు ఆదాయం లభించింది. భవిష్యత్తులో E20 ఇంధన లక్ష్యం నుండి వెనక్కి తగ్గేదే లేదని ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...

