Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్సీ కాలనీలో ఘర్షణ, ముగ్గురికి గాయాలు

Follow Udayam on Google
T. SRINU BABU Aug 16, 2026 3:19 PM పల్నాడు General
ఎస్సీ కాలనీలో ఘర్షణ, ముగ్గురికి గాయాలు - Udayam
సత్తెనపల్లి(మం) ముపాళ్ల ఎస్సీ కాలనీలో పాత కక్షల నేపథ్యంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కత్తులు, కర్రలతో పరస్పరం దాడులకు పాల్పడ్డారు. రెండు రోజుల క్రితం సోషల్ మీడియా గ్రూపులో ఎస్సీకి చెందిన ఇరు వర్గాలు పరస్పరం విమర్శలు చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా, వారిని సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...