Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిత్యావసరాల ధరల మంట

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Jul 14, 2026 7:35 AM అమరావతిGeneral
నిత్యావసరాల ధరల మంట - Udayam
రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే ధరల ప్రభావం ఎక్కువగా ఉంది. మే నెలతో పోల్చితే జూన్‌లో సాధారణ ద్రవ్యోల్బణంతో పాటు ఆహార ద్రవ్యోల్బణం పెరిగినట్లు కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదిక స్పష్టం చేసింది. కేంద్ర నివేదిక ప్రకారం వినియోగదారుల ధరల సూచిక పెరగడం వల్ల సామాన్యులపై తీవ్ర భారం పడుతోంది. గ్రామీణ జనాభా ఈ ధరల పెరుగుదల వల్ల మరింత ఇబ్బందులు పడుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

Comments

G
Loading comments...