Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్ఐఆర్ ప్రక్రియ పకడ్బందీగా పూర్తి చేయాలి

Follow Udayam on Google
అల్లూరి.మహేష్ Aug 21, 2026 6:38 PM ఆదిలాబాద్General
ఎస్ఐఆర్ ప్రక్రియ పకడ్బందీగా పూర్తి చేయాలి - Udayam
ఎస్ఐఆర్ ఓటర్ల జాబితా సవరణను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్‌ రాజర్షి షా ఆదేశించారు. అర్హులందరి పేర్లు ఉండేలా, అనర్హులు, మృతులు, డూప్లికేట్‌ ఓటర్ల వివరాలను సరిచేయాలన్నారు. కలెక్టరేట్‌లో శుక్రవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. జిల్లాలో ASD ఓటర్ల పరిశీలన 95-98 శాతం పూర్తయిందన్నారు. ఫారం-6 స్వీకరణ సెప్టెంబరు 16 వరకు కొనసాగుతుందని తెలిపారు.

Comments

G
Loading comments...