Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్‌ఐఆర్ ఫారాల భర్తీని పరిశీలించిన తహసీల్దార్

Follow Udayam on Google
సందీప్ Jul 08, 2026 10:37 AM నిర్మల్ General
ఎస్‌ఐఆర్ ఫారాల భర్తీని పరిశీలించిన తహసీల్దార్ - Udayam
సోన్ మండలం కడ్తాల్ గ్రామపంచాయతీలో భారత ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల భర్తీ ప్రక్రియను తహసీల్దార్ సంతోష్, గ్రామ సర్పంచ్ గుర్రం రాము మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2002 ఓటరు జాబితాలో పేరు ఉన్నవారు అప్పట్లో నమోదైన పేరు, తల్లిదండ్రుల లేదా భర్త పేరు, చిరునామా, కుటుంబ వివరాలు, ఓటరు నమోదు సంఖ్య తదితర వివరాలను పరిశీలించి, వాటికి అనుగుణంగా ఎన్యూమరేషన్ ఫారాన్ని పూర్తి చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...