Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నాటో నేతలకు ఎర్డోగాన్ తుపాకుల గిఫ్ట్

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Jul 10, 2026 4:23 PM జాతీయంGeneral
నాటో నేతలకు ఎర్డోగాన్ తుపాకుల గిఫ్ట్ - Udayam
నాటో సదస్సుకు హాజరైన దేశాధినేతలకు ఆతిథ్య దేశమైన తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్ ఊహించని బహుమతి ఇచ్చారు. ఆయన అందించిన ప్రత్యేక చెక్క బాక్సుల్లో వింటేజ్ హ్యాండ్‌గన్, ఆరు తూటాలు ఉండటంతో నేతలు షాకయ్యారు. తుర్కియేలో తయారైన తొలి రివాల్వర్ రకం హ్యాండ్‌గన్ 'గుముసే'ను వీరికి కానుకగా ఇచ్చారు. ఈ తుపాకులపై నాటో లోగోతో పాటు ఆయా దేశాధినేతల పేర్లను కూడా ప్రత్యేకంగా చెక్కడం గమనార్హం.

Comments

G
Loading comments...