వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మొక్కలు నాటారు. భవిష్యత్తులో నీటి ఎద్దడి తప్పదని, భూగర్భ జలాలు పడిపోతున్నాయని ఆయన హెచ్చరించారు. ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని, చెట్లు నాటాలని కోరారు.
కాలుష్యాన్ని తగ్గించేందుకు ఈవీ వాహనాలను ప్రోత్సహించాలని, ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నియంత్రించాలని మంత్రి సూచించారు. ప్రకృతిని కాపాడితేనే రేపటి తరాలకు సురక్షితమైన భవిష్యత్తు ఉంటుందని ఆయన అన్నారు.
Comments
Loading comments...

