వార్తలకు తిరిగి వెళ్లండి

మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ఆదిలాబాద్‌లోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో పోలీసు శాఖ 5కె రన్‌ను నిర్వహించింది. గంజాయి రహిత జిల్లా నిర్మాణమే లక్ష్యంగా చేపట్టిన ఈ పరుగులో సుమారు రెండు వేల మంది యువతీ యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎస్పీ అఖిల్ మహాజన్ గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. స్వయంగా రన్‌లో పాల్గొన్న ఎస్పీ, యువతలో స్ఫూర్తిని నింపారు.
Comments
Loading comments...

