వార్తలకు తిరిగి వెళ్లండి

బోధన్‌లో నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలపై విద్యాశాఖ కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. అడ్మిషన్లు, పుస్తకాలు, యూనిఫామ్స్ పేరిట తల్లిదండ్రులపై అదనపు భారం మోపుతున్నారని జేఏసీ నాయకులు ఆరోపించారు.
కనీస సౌకర్యాలు లేని పాఠశాలలపై తనిఖీలు చేపట్టాలని వారు కోరారు. అధికారులు స్పందించకపోతే కలెక్టరేట్ ముట్టడి సహా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
Comments
Loading comments...

