వార్తలకు తిరిగి వెళ్లండి

త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని ఎంపీడీవో నటరాజు కోరారు. బుధవారం కొత్తచెరువు ఎంపీడీవో కార్యాలయంలో వివిధ పార్టీల నాయకులతో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.
మండలంలో 36 పోలింగ్ కేంద్రాలు, 15 గ్రామ పంచాయతీలు, 11 ఎంపీటీసీలు, 33 వేలకుపైగా ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
Comments
Loading comments...

