వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు జిల్లా యాదమరి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల-70, కొత్తపల్లిలో 9వ తరగతి చదువుతున్న ఎ. హేమశ్రీ 2025-26 విద్యా సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఎన్ఎంఎంఎస్ పరీక్షలో అర్హత సాధించింది.
ఈ సందర్భంగా హెచ్ఎం లూతేశ్వరి, ఉపాధ్యాయులు గణపతి, రవికుమార్, శైలజ, కిరణ్మయి తదితరులు హేమశ్రీని సత్కరించారు. 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రతి సంవత్సరం రూ.12 వేల ఉపకార వేతనం అందుతుంది.
Comments
Loading comments...

