వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురం రాయవరం కేజీబీవీ పాఠశాలలో 20 ఏళ్లుగా ఉన్న సమస్య జిల్లా కలెక్టర్ ఎం.విజయ సునీత చొరవతో పరిష్కారమైంది. నాలుగు రోజుల క్రితం పాఠశాలను సందర్శించిన ఆమె, అక్కడి అధ్వాన పరిస్థితిని చూసి వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
మైనింగ్ సిబ్బంది 3 జేసీబీలతో పాఠశాల ప్రాంగణాన్ని శుభ్రం చేసి, క్వారీ గుంతలను గ్రావెల్‌తో నింపారు. దీంతో శుక్రవారం పాఠశాలను మళ్లీ సందర్శించిన కలెక్టర్‌కు విద్యార్థినులు, సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

