Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గిరిజన విద్యార్థుల క్రీడా ప్రతిభకు ప్రోత్సాహం కరువు

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Jul 29, 2026 11:16 AM అల్లూరి General
గిరిజన విద్యార్థుల క్రీడా ప్రతిభకు ప్రోత్సాహం కరువు - Udayam
పాడేరు ఏజెన్సీ గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ప్రతిభావంతులైన విద్యార్థులకు క్రీడల్లో తగిన ప్రోత్సాహం, శిక్షణ, సామగ్రి అందడం లేదని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రతిభ ఉన్న విద్యార్థులు వెనుకబడుతున్నారని చెబుతున్నారు. జిల్లాలో 117 ఆశ్రమాల్లో సుమారు 36 వేల మంది విద్యార్థులు ఉన్నప్పటికీ క్రీడలకు ప్రత్యేక నిధులు లేవని పేర్కొంటున్నారు. గిరిజన సంక్షేమశాఖ తక్షణమే నిధులు కేటాయించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...