వార్తలకు తిరిగి వెళ్లండి

ప్యాపిలి మండలం ఎన్. రంగాపురం గ్రామంలో పోలీసులు శనివారం రాత్రి పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్సై నాగార్జున ప్రజలకు నేరాల నివారణ, సైబర్ మోసాలు, రోడ్డు భద్రత, మహిళలు, చిన్నారుల భద్రతపై అవగాహన కల్పించారు.
సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930, అత్యవసర పరిస్థితుల్లో 100/112కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి పోలీసులకు సహకరించాలని కోరారు.
Comments
Loading comments...

