Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యే గంటాతో నేను అలా చెప్పలేదు: నెల్లిమర్ల ఎమ్మెల్యే

Follow Udayam on Google
B RAJESH Aug 29, 2026 5:12 PM విజయనగరంGeneral
ఎమ్మెల్యే గంటాతో నేను అలా చెప్పలేదు: నెల్లిమర్ల ఎమ్మెల్యే - Udayam
భోగాపురం మండలాన్ని జీవీఎంసీ పరిధిలో విలీనం చేసే ప్రతిపాదనకు తాను అంగీకరించానంటూ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ చెప్పినట్లు వచ్చిన కథనాలను నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి ఖండించారు. స్థానిక ప్రజలు, నాయకులతో చర్చించిన తర్వాతే నిర్ణయంపై స్పష్టత ఇస్తానని మాత్రమే గంటాకు చెప్పానని తెలిపారు. స్థానికంగా ఇంకా అభివృద్ధి లేదని, భూములు కోల్పోయిన వారు ఇబ్బందులు పడుతున్నారని, ఉద్యోగాలు కూడా లేవన్నారు.

Comments

G
Loading comments...