Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యే చదలవాడ: గ్యాస్ వినియోగదారులు ఈ-కేవైసీ చేయించుకోండి

Follow Udayam on Google
T. SRINU BABU Aug 15, 2026 7:57 PM పల్నాడుGeneral
ఎమ్మెల్యే చదలవాడ: గ్యాస్ వినియోగదారులు ఈ-కేవైసీ చేయించుకోండి - Udayam
గ్యాస్ వినియోగదారులందరూ తప్పనిసరిగా ఈ-కేవైసీ చేయించుకోవాలని ఎమ్మెల్యే చదలవాడ సూచించారు. రొంపిచర్ల మండలం నల్లగార్లపాడు గ్రామంలో శనివారం సాయంత్రం ఎమ్మెల్యే పర్యటించారు. ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా ప్రజలను కలుసుకొని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. స్థానిక సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు.

Comments

G
Loading comments...