వార్తలకు తిరిగి వెళ్లండి

చదువుపై ఆసక్తి, తల్లిదండ్రుల ప్రోత్సాహానికి పక్కా ప్రణాళిక తోడవడంతో పొందూరుకు చెందిన కోరుకొండ శ్రావ్య వరుస ర్యాంకులతో మెరిసింది. ఇటీవల విడుదలైన ఏపీఈఏపీసెట్ ఫలితాల్లో రాష్ట్రస్థాయి 2వ ర్యాంకు సాధించిన ఆమె, తెలంగాణ ఈఏపీసెట్‌లో 17వ ర్యాంకు, జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌డ్‌లోనూ ఆలిండియాస్థాయిలో 17వ ర్యాంకులతో సంచలనం సృష్టించింది.
స్కూల్ దశలోనే జేఈఈ అడ్వాన్స్‌డ్ లక్ష్యంగా పెట్టుకుని రోజూ 12 గంటలు శ్రమించినట్లు శ్రావ్య తెలిపింది. అంశాలవారీగా చదువుతూ, కష్టమైన టాపిక్స్‌పై ప్రత్యేక నోట్స్ రాసుకుని సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకోవడమే తన విజయ రహస్యమని ఆమె వివరించింది.
Comments
Loading comments...

